మైసూర్ శాండిల్ సబ్బు, పారాషూట్ కొబ్బరి నూనె కొంటున్నారా..? హుజూర్ నగర్లో ఏమైందో చూడండి !

మైసూర్ శాండిల్ సబ్బు, పారాషూట్ కొబ్బరి నూనె కొంటున్నారా..? హుజూర్ నగర్లో ఏమైందో చూడండి !

హుజూర్ నగర్‌: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో నకిలీ సరుకుల ముఠా గుట్టురట్టయింది. తక్కువ ధరకు కిరాణా షాపులకు నకిలీ సబ్బులు, షాంపూలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొబ్బరి నూనె, బిస్కెట్ ప్యాకెట్లు, టీ పొడి పేర్లతో నకిలీ దందా నడిపిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనుమానంతో తోటి వ్యాపారులు ముఠా సభ్యులను రోడ్డుపై నిలదీశారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కు ఈ పంచాయతీ చేరింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల విచారణ చేశారు.

మైసూర్ శాండిల్ పేరుతో నకిలీ సబ్బులు విక్రయం, పారాషూట్ కొబ్బరి నూనె, రెడ్ లేబుల్ టీ పేర్లతో మోసం చేసినట్లు తేల్చారు. బ్రిటానియా బిస్కెట్లు, వివిధ షాంపూలు నకిలీగా గుర్తించారు. కంఫర్ట్ లాంటి లిక్విడ్లు కూడా నకిలీవేనని అనుమానం ఉంది.

మనం కొనుగోలు చేస్తున్న సరుకులు అసలేవా? నకిలీవా? అనే సందేహంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది. కొంతమంది వ్యాపారులే అక్రమ దందాకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. నకిలీ సరుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. 

►ALSO READ | 3 వేల కోట్లకు ముంచేసిన సాహితీ ఇన్ఫ్రాపై నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు