ఇంటర్నెట్ సెంటర్ పేరుతో అక్రమ సంపాదన..తాండూరులో నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు

ఇంటర్నెట్ సెంటర్ పేరుతో అక్రమ సంపాదన..తాండూరులో నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు

ఇంటర్నెట్ సెంటర్ లో నకిలీ సర్టిఫికెట్ల దందా.. రెవెన్యూ డిపార్టుమెంట్ జారీ చేసిన సర్టిఫికెట్లను నకిలీవి సృష్టించి అక్రమ సంపాదన.. ఏజెంట్లను పెట్టుకుని మరీ దందా..వికారాబాద్ జిల్లా నకిలి సర్టిఫికెట్లు తయారి, విక్రయం కలకలం రేపుతోంది. భూములకు సంబంధించిన నకిలీ ఈసీలు, బర్త్, డెత్ సర్టిఫికెట్లను సృష్టించి డబ్బులు దండుకుంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

వికారాబాద్ జిల్లా తాండూరులో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్న ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం (జనవరి7) అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ సెంటర్ ముసుగులో భూములకు సంబంధించిన నకిలీ ఈసీలు, డెత్, బర్త్ సర్టిఫికెట్లను  సృష్టించి విక్రయిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో ఒరిజినల్ సర్టిఫికెట్లు డౌన్‌లోడ్‌ చేసి ఫొటోషాప్‌ ద్వారా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల తయారీ ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడు. 

నకిలీ సర్టిఫికెట్ల దందాకోసం పలు మండలాల్లో ఏజెంట్లను కూడా పెట్టుకున్నాడు నిందితుడు ప్రవీణ్ కుమార్. ఫిర్యాదులు రావడంతో ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.