గర్భంలోనే శిశువు మృతి ...    హాస్పిటల్ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

గర్భంలోనే శిశువు మృతి ...    హాస్పిటల్ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

ఇబ్రహీంపట్నం, వెలుగు: గర్భంలోని శిశువు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. గర్భిణి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాయి హర్ష దవాఖానలో బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కడారి శ్రీహరి తన భార్య మహేశ్వరిని ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి చూపిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి తీసుకురాగా, హైదరాబాద్‌‌‌‌కు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు.

ఇబ్రహీంపట్నంలోని మరో హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే గర్భంలోని శిశువు మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. అనంతరం మృత శిశువును బయటకు తీశారు. గర్భంలో శిశువు మరణించిన విషయాన్ని సాయి హర్ష హాస్పిటల్​ డాక్టర్లు ముందుగానే గుర్తించినప్పటికీ దాచిపెట్టారని బాధితులు ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం పోయిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు.