కటకటాల్లోకి మోసగాడు .. ఛీటింగ్ కేసులో మారం సురేష్ రెడ్డి అరెస్టు..సురేశ్ వీల్స్ పేరిట వ్యాపారం

కటకటాల్లోకి మోసగాడు .. ఛీటింగ్ కేసులో మారం సురేష్ రెడ్డి అరెస్టు..సురేశ్ వీల్స్ పేరిట వ్యాపారం

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: హైదరాబాద్ నగరంలో పలువురు అమాయకులను మోసం చేసిన ఆరోపణలపై మారం సురేశ్​రెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. మారం సురేశ్​రెడ్డి నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ‘సురేశ్​ వీల్స్’ పేరిట వీల్ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్లు, కార్ టైర్ వ్యాపారం నిర్వహిస్తూ, వైన్ మార్ట్ తదితర వ్యాపారాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

మధ్యవర్తిత్వం పేరుతో కల్వకుర్తి, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ టౌన్, నలగండ్ల, ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ తదితర ప్రాంతాల్లో భవనాలను అద్దెకు తీసుకుని వ్యాపారాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటి యజమానులకు అధిక అద్దె, భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి ఒప్పందాలు కుదుర్చుకుని, అనంతరం అద్దె చెల్లించకుండా తప్పించుకోవడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొన్ని భవనాలను కబ్జా చేసి వాటిలో వైన్ షాపులు, హోటళ్లను అద్దెకు ఇచ్చినట్లు కూడా ఫిర్యాదులు అందాయి. 38 మంది బాధితులు సీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించినట్లు తెలిసింది.