హర్యానా ప్రభుత్వానికి రూ.583 కోట్లు వాపస్‌‌‌‌..ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడి

హర్యానా ప్రభుత్వానికి రూ.583 కోట్లు వాపస్‌‌‌‌..ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడి

న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్ హర్యానా ప్రభుత్వానికి మొత్తం రూ.583 కోట్ల ప్రిన్సిపల్, వడ్డీని చెల్లించినట్లు ప్రకటించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అకౌంట్ల నుంచి  రూ.590 కోట్లను బ్యాంక్ ఉద్యోగులు కొట్టేసిన విషయం తెలిసిందే.  ఈ మోసంపై విచారణ కొనసాగుతోందని బ్యాంక్  పేర్కొంది. 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్  బ్యాంక్ ప్రకారం, కొంతమంది ఉద్యోగులు బయట వ్యక్తులతో కలిసి నకిలీ పత్రాలు, చెల్లింపులను క్లియర్ చేసినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ మోసపోయిన అమౌంట్‌‌‌‌ను  రికవరీ చేయలేకపోతే  బ్యాంక్ పన్ను ముందు లాభం మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  56శాతం తగ్గొచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.