మోదీ మరో రికార్డు.. అప్పుడు ట్విట్టర్..ఇప్పుడు ఇన్ స్టా..100 మిలియన్ల ఫాలోవర్స్

మోదీ మరో రికార్డు.. అప్పుడు ట్విట్టర్..ఇప్పుడు ఇన్ స్టా..100 మిలియన్ల ఫాలోవర్స్

సోషల్ మీడియాలో ప్రధాని మోదీ జోరు కొనసాగుతోంది.  ఇన్ స్టా్గ్రామ్ లో 100 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను  దాటిన తొలి ప్రపంచ రాజకీయ నేత  ఆయన రికార్డు సృష్టించారు. 2014లో  ఇన్ స్టాగ్రామ ఖాతా తెరిచిన మోదీ.. ప్రపంచంలోనే  అత్యధికంగా ఫాలోవర్సు ఉన్న  పొలిటికల్ ఫ్రొఫైల్స్ లో ఒకటిగా  క్రమక్రమంగా ఆయన ఖాతా పెరిగింది. X(ట్విట్టర్)లో ఇప్పటికే ఈ రికార్డును బ్రేక్ చేశారు ప్రధాని మోదీ. 

ఇన్ స్టా ఫీడ్ లో అధికారిక కార్యక్రమాలు,  అంతర్జాతీయ పర్యటనలు ప్రజా ఔట్రీచ్ ప్రోగ్రామ్స్,  సాంస్కృతిక కార్యక్రమాలు,  వ్యక్తిగత  ఫొటోలు, స్నాప్ షాట్లను ప్రధాన మోదీ క్రమం తప్పకుండా షేర్ చేస్తుంటారు.ఇది విభిన్న రకాల ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు సాయపడింది. 

ట్రంప్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్.. 

100 మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించడంతో ప్రధానమోదీ ఇన్ స్టాగ్రామ్ లో ప్రపంచనేతలలో నంబర్ వన్ గా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రెట్టింపు అధికంగా  ఫాలోవర్స్ ను కలిగివున్నారు. ట్రంప్ కు 43.2మిలియన్ల ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా,  బ్రెజిల్, టర్కిష్, అర్జెంటీనా అధ్యక్షులు ఉన్నారు. ఇక భారత్ రాజకీయ నాయకులలో కూడా ఎక్కువమంది  డిజిటల్ మీడియా ఫాలోవర్స్ ఉన్న నేత ప్రధాని మోదీ.  తర్వాత 16.1  మిలియన్ల ఫాలోవర్స్ తో రెండో స్థానంలో యూపీ సీఎం యోగి, 12.6 మిలియన్ల  ఫాలోవర్స్ తో  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. 

సామాజిక మాధ్యమాల వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎప్పుడూ ప్రజలకు చేరువగా ఉంటారు. పార్టీ కార్యక్రమాలు మొదలుకొని విదేశీ పర్యటనల వరకు సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌)లో తనను అనుసరించే వారి విషయంలో ఆయన కొత్త రికార్డు నెలకొల్పారు. ‘ఎక్స్‌’లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఆదివారం 100 మిలియన్ల (10 కోట్లు)ను దాటడం విశేషం. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ‘ఎక్స్‌లో ఉండటం, ఈ సామాజిక మాధ్యమం వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు తదితర వాటికి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది. భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను’’ అని పోస్ట్‌ చేశారు.