నకిరేకల్, వెలుగు: నకిరేకల్ నల్గొండ లయన్స్ క్లబ్స్, నకిరేకల్ నవ్య క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ సహకారంతో మంగళపల్లి గ్రామంలో మంగళవారం హైదరాబాద్ మలక్ పేట యశోద ఆసుపత్రి వైద్య బృందంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి మంగళపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని సేవలు వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో డాక్టర్లు ఉచితంగా అన్ని రకాల పరీక్షలు.. స్కానింగ్‌లు చేశారు.
నకిరేకల్ నల్గొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ పిచ్చయ్య, నవ్య క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 224 మందికి ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు చేయగా.. 124 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. యశోద ఆసుపత్రి డిప్యూటీ మేనేజర్ శ్రీధర్ ఆధ్వర్యంలో 13 మంది డాక్టర్లు సేవలందించారు.
