పెద్దగుట్ట మెడికల్ కాలేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలి .. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

పెద్దగుట్ట మెడికల్ కాలేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలి .. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలోని పెద్దగుట్టపై టెంపుల్ సిటీలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, విద్యార్థులు, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా హాస్పిటల్ నమూనా మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు.

వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అనంతరం మోటకొండూర్ తహసీల్దార్ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించి, స్థానిక పీహెచ్​సీని ఆకస్మిక తనిఖీ చేశారు.   యాదగిరిగుట్టలో ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ప్రతీ ఓటర్ పేరు జాబితాలో ఉండేలా జాగ్రత్త వహించాలని అధికారులకు  దిశానిర్దేశం చేశారు.