హన్వాడ, వెలుగు: వినాయక నిమజ్జనం వేళ అనుమతి లేకుండా డీజేలు పెట్టి.. ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలోని కొందరు యువకులు వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన గురువారం రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండానే డీజేలు పెట్టి పెద్ద పెద్ద సౌండ్లతో ఊరేగింపు చేశారు.
పోలీసులకు సమాచారం అందడంతో కానిస్టేబుల్స్ యాదయ్య, రాఘవేందర్.. గ్రామానికి చేరుకుని డీజే బంద్ చేయించారు. యువకులు న్యూసెన్స్ చేస్తూ వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ వారి విధులకు ఆటంకం కలిగించడంతో 13 మంది యువకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వెంకటేశ్ తెలిపారు.
