ఆదిలాబాద్ రిమ్స్లో మృతిచెందిన చిన్నారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం

ఆదిలాబాద్ రిమ్స్లో మృతిచెందిన చిన్నారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం

ఆసిఫాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ఉట్నూర్​ఐటీడీఏ పీఓ మంద మకరందు పరామర్శించారు. రిమ్స్​లో ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మూలగూడ గ్రామానికి చెందిన చిన్నారి చనిపోగా తల్లిదండ్రులకు శుక్రవారం రూ.5 లక్షల చెక్కును పీవో అందజేశారు. చిన్నారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబ పరిస్థితిని పరిశీలించి, వారికి అందాల్సిన ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని  అధికారులను సూచించారు.