తిర్యాణి మండలంలోని అధికారులపై సర్పంచులు ఫైర్..వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

తిర్యాణి మండలంలోని అధికారులపై సర్పంచులు ఫైర్..వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

తిర్యాణి, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన జనరల్ బాడీ సమావేశం వాడీవేడిగా సాగింది. గ్రామ సమస్యలపై అధికారులను సర్పంచులు ప్రశ్నించారు. రోడ్లు అధ్వానంగా ఉన్నా, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలకు సూపర్‌‌‌‌వైజర్లు సరిగా రావడం లేదని, పిల్లలకు గుడ్లు, పాలు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. 

సమస్యలను సకాలంలో పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ప్రత్యేక అధికారి జాదవ్ అంబాజీ హెచ్చరించారు. ప్రతి 45 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపీడీవో నగేశ్, తహసీల్దార్ శ్రీనివాస్, గ్రంథాలయం చైర్మన్ అనిల్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.