మార్కెట్లో సీసీ కెమెరాల పనితీరు పరిశీలన

మార్కెట్లో సీసీ కెమెరాల పనితీరు పరిశీలన

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లోని సీసీ కెమెరాల పనితీరును శుక్రవారం వరంగల్​ సీపీ శ్వేత, మార్కెట్​ చైర్​పర్సన్​ ప్రియాంకతో కలిసి పరిశీలించారు. అనంతరం మార్కెట్​కు వచ్చిన వివిధ రకాల మిర్చిని, ధరలను పరిశీలించారు.

అంతకుముందు ఏనుమాముల మార్కెట్​కు కొత్త పత్తి వచ్చిన నేపథ్యంలో జెండాపాట ద్వారా క్వింటాల్​కు రూ.8775 గరిష్టంగా ధర పలుకడంతో అట్టి పత్తి రైతు రమణను వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పాలకవర్గం ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో ఛాంబర్​ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి, పాలకవర్గం వైస్ చైర్మన్ జనార్దన్, కమిటీ సభ్యులు, ఆఫీసర్లు, పోలీసులు, వ్యాపారస్తులు, రైతులు తదితరులున్నారు.