జన్నారం, వెలుగు: విదేశాల్లోని విద్యాప్రమాణాలను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసేందుకు ప్రభుత్వం వియత్నాంకు పంపించే టీచర్లలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం అక్కపల్లిగూడ ప్రైమరీ స్కూల్ టీచర్ అంకం కరుణ కూడా ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుతో పాటు భోదన పద్దతులను అధ్యయనం చేసేందుకు విదేశాలకు పంపేందుకు రాష్ట్రవ్యాప్తంగా32 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎంపిక చేయగా కరుణకు అవకాశం దక్కింది. ఈ బృందం అక్టోబర్ 10 నుంచి 17 వరకు వియత్నాంలో పర్యటించనుంది.
