ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ప్రియుడు మృతి...

ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ప్రియుడు మృతి...

ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ హయత్ నగర్ లో చోటు చేసుకుంది. బుధవారం ( జనవరి 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో మహేష్ అనే యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ( జనవరి 6 ) తన ప్రియురాలు పూజ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేకపోయిన మహేష్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన 17 ఏళ్ల  అమ్మాయి పూజ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూజ మరణానికి కారణం అదే గ్రామానికి చెందిన మహేష్ అని ఫార్మాసిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి బంధువులు. 

ఈ క్రమంలో మహేష్ కూడా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ సమీపంలోని బ్రహ్మనపల్లి సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గతంలో కూడా వీరు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహాత్యయత్నానికి పాల్పడి కొలుకున్నట్లు తెలుస్తోంది.

పూజ ఇబ్రహీంపట్నంలో ఇంటర్మీడియట్​చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సిద్దగోని మహేశ్, పూజ గతంలో ప్రేమించుకున్నారు. ఈ విషయంలో తల్లి మందలించి, నచ్చజెప్పడంతో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. సోమవారం పూజ తాతకు మహేశ్​ ఫోన్ చేయగా.. ఆమె లిఫ్ట్​ చేసింది. దీంతో అతను తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. 

ఈ విషయాన్ని పూజ తన తల్లికి చెప్పింది. మంగళవారం ఉదయం లేచి చూసేసరికి ఇంట్లోనే దూలానికి ఉరేసుకుంది. మహేశ్ ​ప్రేమ పేరుతో వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లి అలివేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.