Sankranti Sweets 2026 : సంక్రాంతంటే.. గరిజెలు.. సకినాలతో అదిరిపోవాల్సిందే..!

Sankranti Sweets 2026 :   సంక్రాంతంటే.. గరిజెలు.. సకినాలతో అదిరిపోవాల్సిందే..!

పండుగ వచ్చిదంటే పిల్లలు.. పెద్దలు ఎగిరి గంతేస్తారు.  సంక్రాంతి అంటే వేరే చెప్పనక్కరలేదు. పిల్లల బడికి వారం రోజులు తాళం వేస్తారు.  ఇక అంతే అమ్మమ్మల ఇంటికి.. అత్తల ఇంటికి ఎగురుకుంటూ వెళ్లారు.. అత్తా ఈ సంక్రాంతికి మీఇంటికి  వచ్చా.. ఏం చేసిపెడతావంటే.. సంక్రాంతి స్పెషల్ ఏంటి అని పిల్లలు అడుగుతారు.  పొంగల్​ ఫెస్టివల్​కు సకినాలు.. గరిజలు చేసుకొని తింటారు.  ఎంతో కమ్మగా ఉండే బెల్లం తో తయారు చేసే ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగమైనవి.  మరి ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో సంక్రాంతి స్పెషల్​ వంటకాల్లో తెలుసుకుందాం.  .

 సకినాలు తయారీకి  కావాల్సినవి

  • బియ్యప్పిండి: అరకిలో
  • నువ్వులు: 3 టేబుల్ స్పూన్లు
  • వాము 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు: ఒక టీ స్పూన్
  • నూనె: తగినంత

 టేస్టీ సకినాలు ఎలా తయారు చేయాలంటే..

బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టి వడకట్టి శుభ్రమైన బల్లపై ఆరబెట్టాలి.  తడి ఆరాక వాటిని మిక్సీ పట్టి జల్లించాలి.

తరువాత  ఒక గిన్నెలో పిండి, నువ్వులు, వాము, ఉప్పు చేసి నీళ్లు పోస్తూ కొంచెం పలుచగా కలపాలి. తర్వాత శుభ్రమైన వస్త్రం మీద సకినాలుగా చుట్టాలి. 

చివరిగా బాండీలో తగినంత నూనె పోసి బాగా వేడి చెయ్యాలి. నూనె వేడయ్యాక సకినాలను వేసి వేగించాలి. 

ఇవి నెల రోజులు ఉంటాయి. కరకరలాడుతూ ఉండే సకినాలను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 

గరిజెలు ( కజ్జికాయలు ) తయారీకి కావలసినవి

  • గోధుమ పిండి: 2 కప్పులు
  • గోధుమ రవ్వ :అర కప్పు
  • కొబ్బరి తురుము: ఒకటిన్నర కప్పు
  • చక్కెర: రెండు కప్పులు
  • యాలకుల పొడి: రెండు టీ స్పూన్లు
  • నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
  • నూనె: 4 టీస్పూన్లు
  • బేకింగ్ పౌడర్ అరటీస్పూన్
  • ఉప్పు: టీస్పూన్
  • నూనె: తగినంత

కజ్జికాయల తయారీ విధానం

గోధుమ పిండిలో ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్ల నూనె, అరటీస్పూన్ బేకింగ్ పౌడర్ వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా చేసి పక్కన పెట్టాలి. 

తర్వాత స్టవ్ పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చెయ్యాలి. దానిలో రవ్వ వేసి వేగించాలి.
అది కొద్ది సేపు వేగాక కొబ్బరి తురుము వేసి వేగించాలి.

తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి రెండు నిమిషాలు కలిపితే స్టఫింగ్ రెడీ అవుతుంది. తర్వాత పిండితో పూరీలు చెయ్యాలి పూరీలో స్టఫింగ్ కొద్ది కొద్దిగా వేస్తూ వాటిని గరిజెల ఆకారంలో చుట్టాలి. 

అన్నీ చేసి పెట్టుకున్నాక స్ట బాండీలో నూనె వేసి వేడి చెయ్యాలి.. గరిజెలు చాలా త్వరగా వేగిపోతాయి. అందుకే వాటిని వెంట వెంటనేతిప్పుతూ కొంచెం ఎరుపు రంగు రాగానే నూనెలోంచి తీసేయాలి. 

ఇవి కూడా చాలా.. రోజులు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా ఏ మాత్రం పాడవడు. కొన్నిచోట్ల గరికెలను కజ్జికాయలు అని పిలుస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సంక్రాంతిని  పండుగకు ఊరెళ్లి.. గాలి పటాలు ఎగరేస్తే.. ఇలాంటి స్వీట్స్​ను తింటూ ఎంజాయి చేద్దాం. . .!