Team India: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో నిన్న ( ఫిబ్రవరి 22న) జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక సూర్య సేన కేవలం 111 పరుగులకే చాప చుట్టేశారు. దీంతో 76 రన్స్ తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు టీమిండియా ఒక చెత్త రికార్డును మూటగుట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భారత ప్లేయర్స్ అత్యధిక సార్లు డకౌట్ (0) అవుట్ అయిన టీంగా నిలిచింది. మొత్తం 11 సార్లు టీమిండియా బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ కి చేరారు. మరి ఈ లిస్ట్ లో ఏ స్టార్ట్ ప్లేయర్ ఎన్ని సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడంటే..
ఏ ఆటగాడు ఎన్నిసార్లు డకౌట్ అయ్యాడంటే..?
ALSO READ : టీమిండియా సెమీ ఫైనల్కు వెళ్లే ఛాన్స్ ఉందా..?
* అభిషేక్ శర్మ – 3 సార్లు
* అక్షర్ పటేల్ – 2 సార్లు
* ఇషాన్ కిషన్ – 1సారి
* హార్దిక్ పాండ్యా – 1సారి
* శివమ్ దూబే – 1సారి
* వరుణ్ చక్రవర్తి – 1సారి
* రింకూ సింగ్ – 1సారి
* జస్ప్రీత్ బుమ్రా – 1సారి
డక్ అవుట్ లా విషయంలో భారత్, ఇటలీ (8 డక్‌లు) టాప్ లో ఉండగా.. ఒమాన్ (7 డక్‌లు), పాకిస్థాన్ (6 డక్‌లు) లు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు. సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా జీరో రన్స్ కే అవుట్ కావడంతో మొత్తం జట్టు 111 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ వెళ్లే అవకాశాలు క్లిష్టమైయ్యాయి. ముఖ్యంగా నెట్ రన్ రేట్ బాగా పడిపోయింది. ఇప్పుడు సెమీస్ కి చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో సూర్యకుమార్ సేన భారీ విజయాలతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
