సొంత ఇంటిలో ఉన్నా.. అద్దె ఇంటిలో ఉన్నా కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని అనుసరించాల్సిందే. వాస్తు సరిగా లేనప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి. మరి అలాంటప్పుడు ఇంటి ఓనర్ జాతకం చూడాలా.. అద్దెకు ఉండే వారిది పరిశీలించాలా.. రెండు బీరువాలు ఉంటే ఎక్కడ పెట్టుకోవాలి. మొదలటు విషయాల గురించి వాస్తు నిపుణులు అందించిన సలహాలను ఒకసారి పరిశీలిద్దాం. .!
ప్రశ్న: మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఈ మధ్య ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అద్దె ఇంటికి కూడా వాస్తు వర్తిస్తుందా? ఒకవేళ ఇంటికి వాస్తు చూడాలంటే... ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వాళ్ల జాతకం చూపించుకోవాలా? లేక ఆ ఇంటి యజమాని పేరు మీదే చూపించుకోవాలా?
జవాబు: సొంత ఇంటికే కాదు అద్దె ఇంటికి కూడా వాస్తు వర్తిస్తుంది. అద్దె ఇంట్లోకి దిగేటప్పుడు వాస్తు చూసుకొని వెళ్తే అంతా మంచే జరుగుతుంది. సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా.. వాస్తు అనేది ఇంట్లో నివసించే వాళ్ల పేరున లేదా నక్షత్రంపై ఆధారపడి ఉంటుంది. అయితే నక్షత్రం తెలియనప్పుడు పేరుని బట్టి నక్షత్రం చూసి చెప్తారు. ఇంట్లో బార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా.. ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్నా.. భర్త పేరు మీద వాస్తు చూ పించుకుంటే నే అన్ని శుభాలు జరుగుతాయి
ప్రశ్న: మాపాత ఇంట్లో కప్ బోర్డులు ఉండేవి. అందులోనే పెట్టేవాళ్లం, ఇప్పుడు వేరే ఇంట్లోకి అద్దెకి దిగాం. ఇక్కడ కప్ బోర్డులు లేవని రెండు బీరువాలు కొన్నాం. ఒకదాన్ని బెడ్రూమ్ నైరుతిలో పెట్టాం. ఇంకో బీరువాను ఎక్కడ పెట్టాలో అర్ధం కావట్లేదు. నైరుతి మూలనే కాకుండా, బరువులను ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా?
జవాబు: అవును, బరువులు నైరుతి మూల ఉంటేనే అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఒక బీరువాను బెడ్రూమ్ నైరుతిలో, ఇంకొకటి హాల్ లేదా మరే గదిలోనైనా నైరుతిలో పెట్టుకోవచ్చు. ఏ గదిలోనూ నైరుతిలో స్థలం లేదనుకుంటే, మధ్య దక్షిణ, మధ్య పడమరలో పెట్టుకోవచ్చు. అప్పుడు ఎలాంటి దోషాలు ఉండవు.
