Allu Arjun-Tiger Shroff: అల్లు అర్జున్-అట్లీ మూవీలో టైగర్ ష్రాఫ్? ఆ క్రేజీ వార్తల్లో నిజమెంత?

Allu Arjun-Tiger Shroff: అల్లు అర్జున్-అట్లీ మూవీలో టైగర్ ష్రాఫ్? ఆ క్రేజీ వార్తల్లో నిజమెంత?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం  'AA22xA6' (వర్కింగ్ టైటిల్).  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ' జవాన్ ' చిత్రాన్ని నిర్మించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కును అందుకున్నారు అట్లీ. ఇప్పుడు బన్నీతో కలిసి మరో భారీ విజువల్ వండర్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి నెట్టింట ఒక వార్త హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టైగర్ ష్రాఫ్ ఎంట్రీ నిజమేనా?

గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. నార్త్ , సౌత్ స్టార్లను కలిపి ఒక మల్టీస్టారర్ లెవల్ లో ఈ మూవీ ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుటి వరకు దీనికి మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇది కేవలం రూమర్ మాత్రమేనని టాలీవుడ్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.  ఒకవేళ అల్లు అర్జున్ మూవీలో టైగర్ ష్రాప్ భాగమైతే  మరింత క్రేజ్ ను పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

విజువల్ ఎఫెక్ట్స్ కోసం రూ. 400 కోట్లు!

దర్శకుడు అట్లీ ఈ సినిమాను ఒక 'పారలల్ యూనివర్స్' (Parallel Universe) కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారట. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం మేకర్స్ ఏకంగా రూ. 350 నుండి రూ. 400 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్ (VFX) కోసమే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అంతర్జాతీయ స్టూడియోలతో అట్లీ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం బడ్జెట్ రూ. 600 నుంచి - 700 కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ మూవీ బడ్జెట్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీపడటం లేదు అంటున్నాయి సినీ వర్గాలు.

Also Read :  హైకోర్టులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ పిటిషన్

భారీ తారాగణంతో.. 

ఈ బారీ బడ్జెట్ చిత్రంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథనాయికగా నటిస్తోంది. ఈ మేరకు ఆమె 100 రోజుల డేట్స్ కూడా కేటాయించినట్లు సమాచారం. ఈ మూవీలో బన్నీ మల్టిపుల్ రోల్స్ చేస్తున్నారు. త్రిపాత్రాభినయంలో కపించనున్నారని, అందులో ఒక యానిమేటెడ్ వెర్షన్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లతో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారు. అటు రమ్యకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అట్లీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.