బీఆర్ఎస్ లో హరీశ్ గుంపు తయారు చేస్తుండు: కవిత

బీఆర్ఎస్ లో హరీశ్ గుంపు తయారు చేస్తుండు: కవిత

సూర్యాపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా ఆయన్ను ఒక్క మాట అంటే బీఆర్ఎస్ సభ్యులంతా సభని బాయ్ కాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తర్వాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. సూర్యాపేటలో కవిత మాట్లాడుతూ అసెంబ్లీ జరిగిన తీరు, హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం ఎవరిది? బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ ఒక గుంపు తయారు చేస్తుండు. కేసీఆర్ ను తిట్టినప్పుడు ఈ గుంటనక్క అలాగే వ్యవహరించిందా? బాయ్ కాట్ నిర్ణయం అధిష్టానందే అయితే అది శ్రేయస్కరం కాదు. 

అసెంబ్లీ బయట సభలు పెట్టేకంటే చట్టసభల్లో మాట్లాడే అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదు. గుంట నక్క హరీశ్ వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్టుంది. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి. పీపీటీ చేయాలి. హరీశ్ ధన దాహం కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి మార్పు చేశారు. ఆయన నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగింది' అని ఆరోపించారు. 

ఆల్మట్టి ఎత్తు తగ్గించాలని తీర్మానం చేయండి

‘ప్రతిపక్షం లేకుండా కృష్ణా నీళ్లపై అడ్డగోలు అబద్ధాలు చెప్పారు. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశాడనే తప్ప నీటి వాటా పై చర్చ. లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారు. కృష్ణాపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడంలేదు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్నాటకతో పేచీ ఉంటే రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఎందుకు పరిష్కరించడంలేదు. కురచ స్వ భావంతో గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ సీఎం తప్పులు కప్పిపుచ్చుకుంటున్నడు. చి త్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలి. ఆల్మట్టి ఎత్తు తగ్గించాల ని అసెంబ్లీలో తీర్మానం చేయాలి' అని కవిత డిమాండ్ చేశారు.