ఏ రకం బంగారం.. గ్రాము ధర ఎంతెంత ఉందో తెలుసుకుందామా..!

ఏ రకం బంగారం.. గ్రాము ధర ఎంతెంత ఉందో తెలుసుకుందామా..!

బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ వాతావరణం పరిస్థితులు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. వెనిజువెలాపై అమెరికా దాడి తర్వాత.. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 2026, జనవరి 5వ తేదీన హైదరాబాద్ సిటీలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం...

హైదరాబాద్ లో బంగారం ధరలు :
24 క్యారెట్ల బంగారం : గ్రాము 13 వేల 620 రూపాయలుగా ఉంది.
22 క్యారెట్ల బంగారం : గ్రాము 12 వేల 485 రూపాయలుగా ఉంది.
18 క్యారెట్ల బంగారం : గ్రాము 10 వేల 201 రూపాయలుగా ఉంది. 

ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో కిలో వెండి 2 లక్షల 55 వేల 900 రూపాయలుగా ఉంది. 

స్టాక్ మార్కెట్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంపై మరిన్ని సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ చేసిన కామెంట్ల తర్వాత మన స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభం అయినా.. ఆ తర్వాత వెంటనే కోలుకుని భారీ లాభాల్లోకి వెళ్లింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతుంది.. మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశాలపై పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే నికరమైన బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతున్నారు. దీంతో వాటి ధరలు పెరుగుతున్నాయి.