బీజేపీనే కాదు.. కాంగ్రెస్ ని కూడా విమర్శించా: ‘నోబెల్ గ్రహీత’ అభిజిత్

బీజేపీనే కాదు.. కాంగ్రెస్ ని కూడా విమర్శించా: ‘నోబెల్ గ్రహీత’ అభిజిత్
  • JNUలో చదువుకునేటప్పుడు నిర్మలా సీతారామన్ నా ఫ్రెండ్
  • ఆమె చాలా ఇంటెలిజెంట్: ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ

న్యూఢిల్లీ: JNUలో చదువుకునేటప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనకు ఫ్రెండ్ అని నోబెల్ బహుమతికి ఎంపికైన ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ చెప్పారు. ఆమె చాలా ఇంటెలిజెట్ అని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారని అన్నారు. నాడు తమ ఇద్దరి రాజకీయ అభిప్రాయాల్లో పెద్దగా తేడాలు ఉండేవికాదని గుర్తు చేసుకున్నారు. నోబెల్ విజేతగా ప్రకటన వచ్చిన తర్వాత నిర్మల ట్వీట్ ద్వారా తనను అభినందించారని చెప్పారు.

ఢిల్లీలో జవరహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 1983లో ఎకనమిక్స్ పీజీ పూర్తి చేశారు అభిజిత్. 1984లో నిర్మలా సీతారామన్ ఎకనమిక్స్ పీజీ, ఎంఫిల్ పూర్తి చేశారు.

రాజకీయాలు కాదు .. దేశమే ముందు..

అభిజిత్ కాంగ్రెస్ సపోర్టర్ అన్న కోణంలో బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. తాను బీజేపీ పైనే కాదు… గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారి పాలసీలపై కూడా విమర్శలు చేశానన్నారు అభిజిత్. కావాలంటే నాటి వార్తలను ఒకసారి చూసుకోవాలని చెప్పారు. మేధావులు, విద్యావేత్తలకు ప్రభుత్వంలోని లోపాలను విమర్శించే స్వేచ్ఛ ఉండాలన్నారు. తన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాల కన్నా దేశం మంచినే ముందుగా కోరుకుంటానని చెప్పారు.