జవహర్ నగర్ లో 32 తులాల గోల్డ్ చోరీ..నిందితుడు అరెస్ట్

జవహర్ నగర్ లో 32 తులాల గోల్డ్ చోరీ..నిందితుడు అరెస్ట్

జవహర్ నగర్, వెలుగు: చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్​చేశారు. జవహర్ నగర్ బీజేఆర్ నగర్ లో నివాసం ఉంటున్న మగెడ సత్యనారాయణ ఎలక్ట్రికల్​అండ్​ప్లంబింగ్​పనులు చేస్తుంటాడు. కీసరకు చెందిన మాణిక్​చంద్​తో కలిసి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇండ్లలో  చోరీలు చేస్తున్నారు.

ఈ నెల 11న యాప్రాల్​లోని సాయికృష్ణ ఎన్​క్లేవ్​లో లాకర్​ను పగులగొట్టి 32 తులాల బంగారు ఆభరణాలు, 270 తులాల వెండి, 5 1 తులాల ప్లాటినం వస్తువులు, ల్యాప్​టాప్, విస్కీ బాటిళ్లు, రూ.4.50 లక్షలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి సొత్తు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాణిక్ చంద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.