- పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన బాధిత కుటుంబం
కంది, వెలుగు : అనారోగ్య కారణంగా హాస్పిటల్‌కు తీసుకొచ్చిన ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితున్ని సంగారెడ్డి టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేసి, రిమాండ్తరలించారు. సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ రమేశ్‌కుమార్ వివరాలు వెల్లడించారు.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలానికి చెందిన వోల్లేపు రాజు అనారోగ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం శుక్రవారం తన భార్యాపిల్లలను తీసుకుని సంగారెడ్డికి వచ్చారు. హాస్పిటల్‌కు రావడం లేట్ కావడంతో డాక్టర్లు అందుబాటులో లేక ఆ రోజు రాత్రి సంగారెడ్డిలోని గంజ్‌మైదాన్‌లో గద్దెపై భార్యా పిల్లలతో కలిసి నిద్రపోయారు.
దీన్ని చూసిన పట్టణానికి చెందిన మన్నె అనిల్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ శ్రీశైలంతో కలిసి వారి చిన్న కూతురు రూపను కిడ్నాప్ చేశాడు. ఈ విషయమై రాజు సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టౌన్ సీఐ శ్రీధర్‌రెడ్డి మూడు టీమ్‌లను రంగంలోని దింపి, సీసీ పుటేజీ ఆధారంగా అనిల్‌ను అరెస్టు చేసి, రిమాండ్ తరలించారు. మరో నిందితుడు శ్రీశైలం పరారీలో ఉన్నాడు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. 24 గంటల్లో కేసును ఛేదించిన టౌన్ సీఐ శ్రీధర్‌రెడ్డితో పాటు క్రైమ్ టీం, పెట్రోల్ మొబైల్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కాగా, అనిల్దంపతులకు పెళ్లై ఏండ్లు గడిచినా పిల్లలు కాకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలనుకున్నారు. వోల్లేపు రాజు దంపతులు పిల్లలతో కలిసి నిద్రించడాన్ని గమనించి, ఆ పాపను పెంచుకోవడానికి కిడ్నాప్ప్లాన్ వేసి జైలు పాలయ్యాడు.

