సంతోషం కలిగితే నవ్వుతాం.. బాధ కలిగితే ఏడుస్తాం.. కోపంలో తిట్టడం కొట్టడం.. 'నాకంటే ఎవరూ గొప్పకాదు' అనడం.. మరోసారి 'నేను ఎందుకూ పనికిరాసు అని కుంగిపోవడం.. నువ్వెంత అంటే నువ్వెంత అని విర్రవీగడం.. ఇంకోసారి ఎలాంటి తప్పు చేయకుండా బుద్ధిమంతుల్లా ప్రవర్తించడం... స్వచ్ఛంగా ఉండటం.. ఒక మనిషి ప్రవర్తనలో ఇన్ని స్వభావాలా.. అని ఆశ్చర్యం కలుగుతుంది. అలా ఉండటానికి కారణాలేంటి అని ఆలోచిస్తే... అర్థం కావడం అంత తేలికేం కాదు....
మసుషుల ప్రవర్తనను వాళ్ల లోపలున్న గుణాలే నిర్ణయిస్తాయని వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి. అవే మనిషి మనసును, ఆలోచనలను, ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటాయి. పురాణాల్లో చెప్పిన సత్వరజోతమో గుణాలకు, మనిషి ప్రవర్తనకు సంబంధం ఉంది.
బతకడం అంటే..!
సంతోషంగా జీవించడం అంటే... ఆందోళన, ఒత్తిడి, భయం, బాధ లాంటివి లేకుండా బతకడం చేసే పనిలో పూర్తిగా లీనమవడం. జీవితాన్ని చిన్నపిల్లలు అదే ఆటలా తీసుకోవడం. ప్రకృతిలో పూసే పువ్వులా బతకడం అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు. అది అందరికీ కుదిరే పనేనా అంటే కుదరకపోవచ్చు. కానీ గుణాలను కంట్రోల్లో పెట్టుకుంటే సాధ్యమేనని పురాణాల్లోని అనేక పాత్రల ద్వారా తెలుస్తుంది. మనిషిలో ఉండే మూడు గుణాల గురించి వాటి స్వభావాల గురంచి భగవద్గీతలో వివరంగా ఉంది.
సత్వగుణం
ప్రశాంతత, నిగ్రహం, స్వచ్ఛతతో ఉంటుంది ఈ గుణం. ఈ గుణం ఉన్నవాళ్లు మంచి, చెడులను ఒకేలా తీసుకుంటూ ఎప్పుడూ ఒకేవిధంగా ప్రవర్తిస్తుంటారు. మనిషి జ్ఞానంతో ఆలోచించి చేసే పనులన్నీ సత్యగుణంతో చేసినట్లేనని చెప్పొచ్చు. బుద్దితో ఆలోచించి, ఆరోగ్యంగా జీవిస్తూ ఇతరులకు మేలు చేస్తూ, తనను తాను గౌరవించుకుంటూ ముందుకు వెళ్లడమే ఈ గుణం ఉన్న వాళ్లు చేసే పని. అందుకే ఎప్పుడూ మానసిక ఉల్లాసంతో ఉంటారు. ఇది చేయవలసిన పని, ఇది చేయకూడనిది, ఇది నా శక్తికి మించినది.. లాంటివన్నీ ఆలోచించే స్వభావం ఈ గుణం ఉన్న మనుషుల్లో ఉంటుంది. అందుపల్ల మితంగా ఉంటూ. అందరితో కలిసి సంతోషంగా ఉంటారు. రామాయణంలోని విభీషణుడి పాత్రను సత్వగుణానికి ప్రతీకగా చెప్తారు. తన ఎదుట తప్పు జరుగుతున్నప్పుడు అన్నకు వివరిస్తాడు విబిషణుడు. ధర్మం గురించి ఆలోచించమంటాడు. బుద్ధి జీవిగా ప్రవర్తిస్తాడు. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఈ గుణంతో బతకడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సంతోషం, సుఖం దక్కుతాయి.
రజోగుణం
సాధారణంగా అందరిలో ఉండే అభిప్రాయాలు ఇష్టాలు ఈ గుణానికి సంబంధించినవి. అయితే ఈ గుణం ఎక్కువైనప్పుడు మనిషి సంతోషంగా ఉంచటం మానేసి, కోరికలు తీరడం లేదని అసహనంగా ప్రవర్తించొచ్చు. ఈ గుణంతో ఉన్నవాళ్లు పొందే సంతోషం అన్నీ మొదట చాలా సంతోషంగా అనిపిస్తాయి. చివరకు వచ్చేసరికి చేదుగా తోస్తాయి. కోపం, ఆసూయ, ద్వేషం, పగలాంటివన్నీ
ఈ గణం కిందకే వస్తాయి. రామాయణంలోని రావణాసురుడిని రజోగుణానికి ప్రతీకగా చెప్తారు. రావణుడికి నేనే గొప్పవాడిననే అహం ఎక్కువ. కీర్తి ప్రతిష్టలు ముఖ్యం. ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా.. ఇంకా కావాలనే ఆశ. వాటికోసం తప్పు ఒప్పులు గురించి అలోచించడు. ముందు వెనుక ఏల జరుగుతున్నా పట్టించుకోడు. అందుకే సీతను అపహరించి చివరకు ప్రాణం మీదకు తెడ్చుకున్నాడు. అలాగే ఈ గుణ స్వభావం వల్ల ధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా చేయడానికే సిద్ధపడతారు. తమ శక్తి మీద అపారమైన నమ్మకం ఉంటుంది. కానీ అది అన్నివేళలా పనికి రాదని గుర్తించరు. చేసే పసులలో వీళ్లు సంతోషంగా ఉన్నా, చివరకు ప్రమాదాలు తప్పవు. దీనివల్ల అజ్ఞానం తప్ప వివేకంతో ఆలోచించే శక్తి ఉండదు. ఇలాంటి స్వభావం ప్రతి ఒక్కరిలో అప్పుడప్పుడూ ఉంటుంది. దానిని వదిలేస్తే సంతోషంగా జీవించగలుగుతారు.
తమోగుణం
కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాత్పర్యాలతో మిడి ఉంటుంది తమోగుణం. ఈ గుణం ఉన్నవాళ్లు బద్దకంగా ఉంటారు. ఏ పని చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ చేసినా ఎందుకు చేస్తున్నాం? కారణం ఏమిటి? ఫలితం ఎలా ఉంటుంది? అని ఆలోచించరు. నలుగురికీ కాదు... తమకు కూడా ఉపయోగపడని వసులు చేస్తూ అదే జీవితం అన్నట్లు బతికేస్తుంటారు. మంచిని చెడుగా చెడును మంచిగా భావించి, అన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. రామాయణంలోని కుంభకర్ణుడిని తమోగుణానికి ప్రతీకగా చెప్తారు. ఏడాదిలో ఆరు నెలలు నిద్ర, ఆరు నెలలు మెలకువతో ఉంటాడు. భోజన ప్రియుడు శారీరక అవసరాలు మాత్రమే ఇతడికి ముఖ్యం.. అందుకే యుద్ధం వచ్చినా అతడికి తెలియదు. బలవంతంగా లేపితే నిద్రలేస్తాడు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. కోరికలు తీర్చుకోవడం కోసమే జీవిస్తూ కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కోలేక భయపడేవాళ్లు, బాధపడే వాళ్లలో ఈ గుణం ఉంటుంది. దీనిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. లేదంటే జీవితాన్ని సర్వనాశనం చేసి ఎందుకు పనికిరాని వాళ్లలా మిగులుస్తుంది.
ఆలోచించు.. ఆచరించు
ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు... మారుతూ ఉంటుంది. శరీరం మనును, ఆలోచనలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు మారుతూ ఉంటాయి. అది ప్రకృతి ధర్మం. బుద్ధి కూడా అంతే.. ఒకచోట కట్టిపడేయాలంటే కుదరదు. చేయాల్సిందల్లా ఏమిటంటే..! ఆలోచించి సత్వగుణంతో ప్రవర్తించాలి. అవసరమైనప్పుడు రజోగుణ స్వభావంతో ఉండాలి. అంతేగానీ.. తమోగుణం ప్రదర్శించకూడదు. మనిషి దేవుడికి దగ్గరవ్వాలంటే తమోగుణాన్ని పూర్తిగా పదిచేయమని భగవద్గీత చెప్పుంది. దేవుడికి దగ్గరవడమంటే సంతోషంగా, సుఖంగా, అహ్లాదకరంగా, అందరితో కలిసి జీవించడమే! అంటే సత్వగుణ స్వభావాల్ని అలవాటు చేసుకోవాలి... ప్రతి మనిషిలో ఈ మూడు గుణాలు. ఉంటాయి. వాటి స్వభావాన్ని తెలుసుకుని ప్రవర్తించడమే మంచివాళ్లు చేయాల్సిన పని.

