నన్ను హీరోయిన్ అంటే నచ్చదు!

నన్ను హీరోయిన్ అంటే నచ్చదు!

ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నరష్మిక మందాన్న.. ఈ నెల 21న ‘భీష్మ’తో కలిసి వస్తోంది.
ఈ సందర్భంగా రష్మిక చెప్పిన ముచ్చట్లు..

ఈ సినిమాకి ‘సింగిల్స్ ఫర్ ఎవర్’ ట్యాగ్ లైన్ పెట్టారు కానీ.. నితిన్  త్వరలోనే  ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డైరెక్టర్ వెంకీ కుడుముల, నేను మాత్రమే సింగిల్స్ గా మిగిలాం.  కన్నడలో ‘యాజమాన’  సినిమా చేసేప్పుడు ఆ హీరో దర్శన్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నితిన్‌తో నటిస్తుంటే నితిన్ కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. ఎంగేజ్​మెంట్​కి రెండు రోజుల ముందే తన ప్రేమకథ నాకు తెలిసింది.

హీరోయిన్స్​కి ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేయడం తప్పదు. నా ఫిట్‌నెస్ మొత్తం నా డైట్లోనే ఉంటుంది. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాను. నిరంతరం జిమ్, జాగింగ్  చేస్తూనే ఉంటాను.

ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఈ సినిమా అని మా ఫ్రెండ్స్‌కి చెబితే  అలాంటి సినిమా ఎందుకు అన్నారు. కానీ టీజర్ చూసి చాలా ఎంజాయ్ చేశారు.  ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. అందరూ చూడాల్సిన మూవీ. మంచి ఎంటర్​టైనర్​. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది నా పాత్ర. పేరు చైత్ర. భీష్మ ఆర్గానిక్‌ కంపెనీలో పని చేస్తుంటాను.  అనంత్ నాగ్ నాకు తండ్రిగా నటించారు. అంత గొప్ప నటుడితో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఆ విషయంలో చాలా  కేర్ తీసుకున్నాను. ముందు ప్రాక్టీస్ చేశాక డబ్బింగ్ చెప్పాను. అలాగే డ్యాన్స్ కోసం బాగా కష్టపడ్డాను. మరో  నాలుగు రోజుల్లో మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను.

‘అఆ’లో నితిన్, సమంతల పర్ఫార్మెన్స్ చూసి ఇలాంటి సినిమా నేను కూడా చేయాలి అనుకున్నాను. ఇప్పటికి చాన్స్ వచ్చింది. నితిన్‌తో యాక్ట్ చేయడం చాలా కంఫర్ట్​గా అనిపించింది. సెట్​లో కాలేజ్ బోయ్​లా ఉంటాడు.

అందరూ నన్ను హీరోయిన్ అనడం నాకు నచ్చదు. నా ఉద్దేశంలో హీరోలు, హీరోయిన్లు ఉండరు. యాక్టర్స్ ఉంటారు. అందుకే మేల్ యాక్టర్, ఫీమేల్ యాక్టర్ అంటే అందంగా ఉంటుంది.

స్ర్కిప్ట్ ఎంపికలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అందుకే నాకు  హిట్స్ వచ్చాయి. దాదాపు యాభై, అరవై సినిమాలు రిజెక్ట్ చేశాను. చేస్తున్న సినిమాకి, చేయబోయే సినిమాకి డిఫరెన్స్ చూసుకుని మరీ సినిమాలు ఎంపిక చేసుకుంటాను. ఆ పాత్ర ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉందా లేదా? అని చూసుకుంటాను. ముఖ్యంగా నవ్వించే సినిమాలు బాగుంటాయి. సినిమాలో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని  నా గురించి చాలామంది చెప్పారు.

షూటింగ్ సమయంలో షాట్ అయ్యాక మానిటర్ చూసుకోను. చూస్తే ఇంకా బెటర్ మెంట్ ఇవ్వాలనిపిస్తుంది. ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకు  ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.

బన్నీతో  సినిమా మార్చి రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ సినిమాలో  రష్మిక కొత్తగా కనిపిస్తుంది. తమిళంలో  నటిస్తున్నాను.  డేట్స్ అడ్జస్ట్ కాక  మరే సినిమా ఒప్పుకోలేదు.

ఐటీ రెయిడ్స్​ జరగడం ఆశ్చర్యంగా అనిపించింది.  మా డాడీ బిజినెస్​ మేన్​. నేనొక యాక్టర్ని. ఐటీ రెయిడ్స్ జరిగేంత డబ్బు మా దగ్గర లేదు కదా అనుకున్నా. ఎవరో ఇచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఏమీ దొరకలేదని వెనుదిరిగారు.