మీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో..జగదీశ్ రెడ్డిపై అద్దంకి ఫైర్

మీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో..జగదీశ్ రెడ్డిపై అద్దంకి ఫైర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌తో కాంగ్రెస్ నేతలు టచ్‌‌‌‌లో ఉన్నారంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని విప్ అద్దంకి దయాకర్ సోమవారం ఒక ప్రకటనలోఅన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలు టచ్‌‌‌‌లో ఉన్నారనే సంగతి పక్కన పెట్టి ముందు మీ పార్టీ భవిష్యత్తులో ఉంటుందో లేదో చూసుకోవాలి’’ అని జగదీశ్ రెడ్డికి సలహా ఇచ్చారు.

బీఆర్ఎస్​లో ప్రస్తుతం మూడు ముక్కలాట సాగుతోందని.. ముందు జగదీశ్ రెడ్డి తాను కేటీఆర్ వర్గమో, లేక హరీశ్ రావు వర్గమో తేల్చుకోవాలని  కోరారు. బీఆర్ఎస్‌‌‌‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నారనే నిజాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘మీ పార్టీ అసలు పేరు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సా? టీఆర్ఎస్సా?’’ ప్రజలకు స్పష్టం చేయాలని దయాకర్ కోరారు. టీఆర్ఎస్ పార్టీని పెట్టిన కవిత లేవనెత్తిన ప్రశ్నలకు జగదీశ్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.