ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన అదనపు కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన అదనపు కలెక్టర్

ఖమ్మం టౌన్,వెలుగు :  రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమయంలో తాలు  పేరుతో ఎలాంటి కోతలు విధించొద్దని అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆదివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు, మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తాలు పేరుతో రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించరాదని స్పష్టం చేశారు.

రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని సరైన కారణాలు లేకుండా తిరస్కరించవద్దని సూచించారు. ధాన్యం  నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని అనిపిస్తే..  వెంటనే జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో)కు  సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన సాంకేతిక సహాయ కమిటీని రైస్ మిల్లులకు పంపించి ధాన్యం నాణ్యతను పరిశీలిస్తామని తెలిపారు.