సీఎం వరుణయాగంపైనా విమర్శలా?

సీఎం వరుణయాగంపైనా విమర్శలా?
  •     బీఆర్ఎస్ నేతలవి దిగజారుడు రాజకీయాలు: విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి, పంటలు బాగా పండాలని సీఎం రేవంత్ రెడ్డి వరుణయాగం చేస్తే.. దానిపై కూడా బీఆర్‌‌‌‌ఎస్ నేతలు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. 

వరుణయాగం పేరుతో డ్రామాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన తీరుచూస్తే వారి అక్కసు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతున్నదన్నారు. గతంలో కేసీఆర్ అయిత చండీయాగం, సహస్ర చండీయాగం, రాజశ్యామల యాగం, నవగ్రహ చండీ యాగాలను కేసీఆర్ దంపతులు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పుడు తాము కేసీఆర్ విశ్వాసాలను దెబ్బతీసేలా విమర్శలు చేయలేదు కదా.. అని అన్నారు.