2030 తర్వాత అన్నీ ఎలక్ట్రిక్​ వాహనాలే

2030 తర్వాత అన్నీ ఎలక్ట్రిక్​ వాహనాలే

హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్‌‌, శ్రీశైలం హైడల్‌‌ ప్రాజెక్టుల్లో రివర్సబుల్‌‌ పంపింగ్‌‌తో అదనపు జలవిద్యుత్‌‌ ను ఉత్పత్తి చేశామని  ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో  సీఎండీ ప్రభాకర్‌‌రావు చెప్పారు. రిపబ్లిక్​ డే సందర్భంగా విద్యుత్‌‌సౌధలో జెండా ఎగరేసిన ఆయన మాట్లాడుతూ మూడేండ్లలో రివర్సబుల్‌‌ పంపింగ్‌‌తో ‘శ్రీశైలం’ నుంచి 518 మిలియన్‌‌ యూనిట్లు, ‘సాగర్‌‌’  ద్వారా 162 మిలియన్‌‌ యూనిట్లు ఉత్పత్తి చేశామన్నారు.

గ్లోబల్‌‌ వార్మింగ్‌‌తో 2030 నాటికి ప్రజారవాణా రంగంలో 100 శాతం , వ్యక్తిగత రవాణా రంగంలో 40శాతం ఎలక్ట్రిక్​ వాహనాలు రాబోతున్నాయన్నారు. దీంతో ఆటో మొబైల్‌‌ ఇండస్ట్రీకి వెహికల్స్​చార్జింగ్‌‌ స్టేషన్ల అవసరం ఏర్పడుతుందని, వీటికి అనుగుణంగా బల్క్‌‌ పవర్‌‌ అందించేందుకు తెలంగాణ విద్యుత్‌‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

see also: కమలం గ్రాఫ్​ పెరిగింది

see also: పాల సేకరణ ధర రూ.2 పెరిగింది

see also: ఈరోజే చైర్‌‌ పర్సన్లు, మేయర్ల ఎన్నిక

see also: ‘హంగ్​’లలో ఎక్కువ టీఆర్​ఎస్​ చేతికి?