శామ్‌‌సంగ్‌‌లో శాటిలైట్‌‌ కనెక్టివిటీ

శామ్‌‌సంగ్‌‌లో శాటిలైట్‌‌ కనెక్టివిటీ

రీసెంట్‌‌గా రిలీజ్‌‌అయిన ఐఫోన్‌‌ 14 సిరీస్‌‌ ఫోన్‌‌లలో ఎమర్జెన్సీ శాటిలైట్‌‌ కనెక్టివిటీ ఫీచర్‌‌‌‌ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సిమ్‌‌కి సిగ్నల్స్‌‌ లేనప్పుడు, ఎమర్జెన్సీ టైంలో ఈ ఫీచర్‌‌ సాయపడుతుంది. శాటిలైట్‌‌కి డైరెక్ట్‌‌గా కనెక్ట్‌‌ అయి ఉండటం వల్ల ఫోన్‌‌లో ఉన్న ఎమర్జెన్సీ నెంబర్స్‌‌కి కాల్‌‌ వెళ్తుంది. దాంతో ప్రమాదంనుంచి బయటపడొచ్చు. శామ్‌‌సంగ్‌‌ కంపెనీ కూడా ఇప్పుడు ఈ ఫీచర్‌‌‌‌ని టెస్ట్‌‌‌‌ చేస్తోంది. రానున్న ‘ఎస్‌‌ సిరీస్‌‌’ ఫోన్స్‌‌ అన్నింటిలో  ఈ ఫీచర్‌‌‌‌ ఉండబోతుందని ప్రకటించింది శామ్‌‌సంగ్‌‌.

ఉబెర్‌‌‌‌లో వాయిస్‌‌ షేరింగ్‌‌

యూజర్ల సేఫ్టీకి ఉబెర్‌‌‌‌ ట్యాక్సీ సర్వీస్‌‌ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.  అందుకే, ఇన్సూరెన్స్‌‌, సేప్టీ సూచనల్లాంటివి ఇస్తుంటుంది. అయితే, ఇప్పుడో కొత్త ఫీచర్‌‌‌‌ని తీసుకొచ్చింది. ఇందులో డ్రైవర్‌‌‌‌‌‌కి వాయిస్ ఇన్‌‌స్ట్రక్షన్స్‌‌ ఇవ్వొచ్చు. ఈ ఫీచర్ సేఫ్టీగా కూడా ఉపయోగపడుతుంది. ఉబెర్‌‌‌‌ రైడ్‌‌ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌కి షేర్‌‌‌‌ చేసినట్టే, వాయిస్‌‌ని కూడా షేర్ చేయొచ్చు. యాప్‌‌లో వాయిస్‌‌ రికార్డ్‌‌ చేసిన 15 రోజులవరకు ఆ ఆడియో క్లిప్‌‌ యాప్‌‌లోనే ఉంటుంది. తరువాత ఆటోమెటిక్‌‌గా డిలిట్‌‌ అవుతుంది. రైడ్‌‌ బుక్‌‌ చేశాక సేఫ్టీ ఐకాన్‌‌లో ఉన్న సింబల్‌‌ని క్లిక్ చేసి ఆడియోని రికార్డ్‌‌ చేసి సెండ్‌‌ చేయాలి. రికార్డ్‌‌ చేస్తున్నప్పుడు ఫోన్‌‌ స్విచ్‌‌ఆఫ్‌‌ అయినా కూడా ఆడియో షేర్ అవుతుంది.