ఐపీఎల్ 2026 ఫైనల్ వేదిక మారింది. ఫైనల్ మ్యాచ్ ను బెంగళూర్ నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు మార్చింది బీసీసీఐ. కర్నాటకలో ఎమ్మెల్యే కోటా ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, బెంగళూర్లో గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ వేదికను మార్చింది. బీసీసీఐ నిర్ణయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూల్స్ ప్రకారం గత సీజన్ లో కప్ కొట్టిన జట్టు హోం టౌన్ లోని స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించటం ఆనవాయితీ. ఈ లెక్కన చూస్తే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది.
గతంలో బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరగటం.. ఆ తర్వాత మ్యాచ్ టికెట్ల అమ్మకంలో వివాదం వంటి అంశాల కారణంగా ఫైనల్ మ్యాచ్ ను బెంగళూరులో కాకుండా అహ్మదాబాద్ లో నిర్వహించాలని ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి
