Team India Injuries: శ్రీలంకతో ఆగస్టు 15వ తేదీ నుంచి రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్లు ఒకేసారి గాయాల బారిన పడటంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. డబ్ల్యూటీసీ (WTC) రేసులో నిలవాలంటే ఈ సిరీస్ కీలకమైన వేళ, ప్లేయర్ల ఫిట్‌నెస్ చూసుకోవాల్సిన బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) తీరుపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆ పోస్టు ఖాళీ:
సీఓఈ, టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల మధ్య సమన్వయ లోపం ఉందనే వార్తలను వీవీఎస్ లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. గత 18 నెలల క్రితం నితిన్ పటేల్ వైదొలిగినప్పటి నుంచి సీఓఈలో హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పోస్టు ఖాళీగా ఉందనే విషయాన్ని తెలిపారు. ఆండ్రూ లీపస్ సహా పలువురు అంతర్జాతీయ నిపుణులతో చర్చలు జరిపినా, చివరి నిమిషంలో వారు కుటుంబ కారణాలతో తప్పుకున్నారని వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు.
వీవీఎస్ లక్ష్మణ్పై కైఫ్ ఫైర్:
సీఓఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ దగ్గర డబ్బుకు కొదవేం లేదు.. పారితోషికం ఎంతైనా ఇచ్చే స్తోమత ఉంది.. పిలిస్తే పరుగెత్తుకుంటూ వచ్చేంత క్రేజ్ ఉన్న చోట.. ఇంకా ఆ కీలక పోస్టు ఖాళీగా ఉందంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఈ లోపాలను బీసీసీఐ వెంటనే సరిదిద్దకపోతే జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు.
ALSO READ : రన్స్ కొట్టుడే కాదు.. ట్యాక్స్ కట్టడంలోనూ కింగ్ కోహ్లీనే టాప్!
సర్ఫరాజ్, ఆకిబ్ నబీలకు లక్కీ ఛాన్స్:
కీలక ఆటగాళ్ల గాయాల కారణంగా జట్టుకి దూరం కావడంతో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, జమ్మూ కాశ్మీర్ ఆల్ రౌండర్ ఆకిబ్ నబీలకు భారత టెస్ట్ జట్టులోకి పిలుపు లభించింది. గాయంతో సిరీస్‌కు దూరమైన సాయి సుదర్శన్ స్థానాన్ని సర్ఫరాజ్ ఖాన్ భర్తీ చేయనుండగా.. బుమ్రా స్థానాన్ని ఆకిబ్ నబీ అన్నాడు. కానీ తుది జట్టులో (Playing XI) వీరికి అవకాశం దక్కుతుందా లేదో చూడాలి.
