హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఏఐసీసీ జనర ల్ సెక్రటరీ జై రాం రమేశ్ అన్నారు. ప్రధాని స్పీచ్తో అది అర్థమైపోయిం దన్నారు. బీఆర్ఎస్అత్యంత అవినీతి పార్టీ అని మోదీ కామెంట్ చేశారని, దాన్ని బట్టే ఆ పార్టీలు ఒక్కటే అని చెప్పొచ్చని శని వారం ట్వీట్చేశారు. గతంలో మేఘాలయ పర్యటనలో హోం మంత్రి అమిత్షా కూడా ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర సీఎం సంగ్మాతో జట్టు కట్టారన్నారు.
అమిత్షా చేసిన ఆరోపణలకు సంబంధించి సీఎం సంగ్మాను విచారించాల్సిందిగా సీబీఐకి ఈ ఏడాది మార్చి 21న లేఖ రాసినట్టు తెలిపారు. ఎన్సీపీ అంటనే నేచురల్లీ కరప్ట్పార్టీ అంటూ మోదీ ఆరోపణలు గుప్పించారని ట్వీట్లో జైరాం రమేశ్ పేర్కొన్నారు.

