V6 News

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న లక్నో

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న లక్నో

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ )2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో లక్నో మొదట బ్యాటింగ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ మ్యాచులో భారీ స్కోర్ సాధించి ఆర్సీబీపై ఒత్తిడి పెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. కానీ లక్నో బ్యాటర్లని తొందరగా ఔట్ చేసి పట్టుసాధించాలని బెంగళూరు టార్గెట్ పెట్టుకుంది. 

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ..  మేము ముందుగా బౌలింగ్ చేస్తాం.. పిచ్ అద్భుతంగా ఉంది, కాబట్టి ఛేజింగ్ చేయడం ద్వారా మొదటి ఇన్నింగ్స్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నాం.. ఇది బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మొదట బౌలింగ్ చేయడం ద్వారా లక్నోపై ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నాడు. ఇక జాకబ్ డఫీ స్థానంలో తుది జట్టులోకి స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి వచ్చారని పేర్కొన్నాడు. 

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు బాగుంది.. మొదట బ్యాటింగ్ చేసినా, తర్వాత చేసినా మెరుగైన క్రికెట్ ఆడటం ముఖ్యం.. జట్టుగా మేమంతా కలిసికట్టుగా ఉండి, బాధ్యతాయుతంగా ఆడాలని నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. 

ఇరు జట్లు: 
లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

ఇంపాక్ట్ ప్లేయర్స్:  మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్, మయాంక్ యాదవ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్
ఇంపాక్ట్ ప్లేయర్స్: విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, కనిష్క్ చౌహాన్, మంగేష్ యాదవ్