కరీంనగర్ జిల్లాలో అవినీతి మున్సిపల్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. హుజూరాబాద్ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్.. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. వాటర్ డ్రెయిన్ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
హుజూరాబాద్ మున్సిపల్ ఆఫీసులో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. హుజూరాబాద్ కు చెందిన సంతోష్ కుమార్ అనే కాంట్రాక్టర్ నుంచి రూ 50వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు సుధాకర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.
హుజరాబాద్ స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులకు సంబంధించిన మెజర్‌మెంట్ బుక్ నమోదు, ఫైనల్ బిల్ ప్రాసెస్ కోసం కాంట్రాక్టర్ సంతోష్ కుమార్ ను ఏఈ సుధాకర్ రెడ్డి రూ.50వేల లంచం డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆఫీసులో బాధితుడినుంచి లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. SPE & ACB ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచ నున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

