ఇంకో రెండేండ్లు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రావు

ఇంకో రెండేండ్లు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రావు
  • ఏఐసీటీఈ హ్యాండ్​బుక్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ఇంకో రెండేండ్ల దాకా కొత్తగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వబోమని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకే షన్(ఏఐసీటీఈ) స్పష్టంచేసింది. అయి తే ఇప్పటివరకూ ఇంజనీరింగ్ కాలేజీలు లేని జిల్లాల్లో గవర్నమెంట్ కాలేజీలను ఏర్పాటు చేస్తే అనుమతులు ఇస్తామని తెలిపింది. ఈమేరకు మంగళవారం ఏఐసీటీఈ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ అవ్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్​ను రిలీజ్ చేశారు. 2022–23 అకడమిక్ ఇయర్​ విధివిధానాలను వెల్లడించింది.ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తో పాటు టెక్నికల్ కాలేజీలు వచ్చే అకడ మిక్ ఇయర్​లో ఏఐసీటీఈ అవ్రూవల్ కోసం మంగళవారం నుంచే అప్లై చేసు కోవచ్చని పేర్కొంది. ఎలాంటి ఫైన్​ లేకుం డా ఏప్రిల్ 22 వరకూ గడువు ఇచ్చినట్టు స్పష్టంచేసింది. పీఎం కేర్​ స్కీమ్​లో భాగంగా కరోనాతో పేరెంట్స్​ను కోల్పో యిన స్టూడెంట్లకు పాలిటెక్నిక్ కాలేజీ ల్లోని ప్రతికోర్సులో 2 సీట్లకు పర్మిషన్ ఇస్తున్నట్టు ప్రకటించింది.