‘చక్రవ్యూహం చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న అజయ్

‘చక్రవ్యూహం చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న అజయ్

విలన్‌‌‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌గా టాలీవుడ్‌‌‌‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అజయ్. అడపాదడపా హీరోగానూ కనిపించిన అజయ్.. మరోసారి లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘చక్రవ్యూహం’. ఇదొక మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. చెట్కూరి మధుసూదన్ దర్శకుడు. సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సావిత్రి నిర్మిస్తున్నారు.

భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నాడు.  రీసెంట్‌‌‌‌గా ఈ సినిమా పోస్టర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు మేకర్స్. పోలీస్ పాత్రలో  కనిపిస్తున్న అజయ్ ఇంటెన్స్ లుక్‌‌‌‌తో ఉన్నాడు. మర్డర్ కేసును సాల్వ్ చేసే ప్రయత్నంలో సీరియస్‌‌‌‌గా వర్క్‌‌‌‌ మూడ్‌‌‌‌లో కనిపిస్తున్నాడు అజయ్. త్వరలోనే మరిన్ని అప్‌‌‌‌డేట్స్ ప్రకటిస్తామన్నారు నిర్మాత.