83 ఏళ్ల వయస్సులో ఇంకేం రాజకీయాలు : పవార్ పై తిరుగుబాటు నేతలు

83 ఏళ్ల వయస్సులో ఇంకేం రాజకీయాలు : పవార్ పై తిరుగుబాటు నేతలు

మహారాష్ట్రలో పవార్ ల మధ్య నువ్వా నేనా అనే రీతిలో రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో 83 ఏళ్లు వచ్చినా ఇంకా మీరు రిటైర్ కాకుండా రాజకీయాలు ఎందుకని అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనక్కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్‌కి పదవీ విరమణ చేయాల్సిన సమయం వచ్చిందని, ఎన్‌సీపీ పగ్గాలు తనకు అప్పగించాలని ఆయన వ్యాఖ్యానించారు.

ముంబైలోని బాంద్రా, ఎంఈటీ భుజ్‌బల్ నాలెడ్జ్ సిటీలో ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసిన అజిత్ పవార్.. "మీరు నన్ను అందరి ముందు విలన్‌గా చూపించారు. ఇప్పటికీ ఆయన (శరద్ పవార్) పట్ల నాకు లోతైన గౌరవం ఉంది" అని అన్నారు. "ఎల్‌కె అద్వానీ, ఎల్‌కె అద్వానీ లాంటి బీజేపీ నాయకులు 75 ఏళ్ళ వయసులోనే పదవీ విరమణ చేశారు. ఇది కొత్త తరం వాళ్లు ఎదగడానికి వీలు కల్పిస్తుంది. మీరు (శరద్ పవార్) మాకు మీ ఆశీస్సులు అందించండి చాలు" అని ఒక ఎన్‌సీపీ తిరుగుబాటు వర్గాన్ని ఉద్దేశించి పవార్ అన్నారు. "మీకు 83 ఏళ్లు, మీరు ఇంక ఆగుతారా ? మీ ఆశీస్సులు మాకు అందించండి చాలు. మీరు దీర్ఘాయువుతో జీవించాలని మేం ప్రార్థిస్తాం" అని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

https://twitter.com/ANI/status/1676529423296901120

శరద్ పవార్ వయస్సుపై అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఘాటుగా స్పందించారు. “అమితాబ్ బచ్చన్ వయస్సు 82, అయినా ఆయన ఇంకా పనిచేస్తున్నారు” అని అజిత్ పవార్ కు కౌంటర్ వేశారు. మమ్మల్ని అగౌరవపరచండి, కానీ మా నాన్నని (శరద్ పవార్) కాదు" అని సూలే అన్నారు. ఈ పోరాటం బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నదని, ఈ దేశంలో అత్యంత అవినీతి గల పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే అని ఆమె ఆరోపించారు. "కొంతమంది అవతలి వాళ్లు వృద్ధులైపోయారని అనుకుంటారు. అందుకే వారిని ఆశీర్వదించాలి. కానీ వారిని ఎందుకు ఆశీర్వదించాలి? రతన్ టాటా సాహెబ్ కంటే మూడేళ్లు పెద్దవాడు. అయినా దేశంలోని అతిపెద్ద గ్రూప్ కు నాయకత్వం వహిస్తున్నాడు" అని ఆమె చెప్పుకొచ్చారు.

https://twitter.com/ANI/status/1676534699517427712