పొత్తుల్లేవ్.. ఒంటరిగా పోటీకి రెడీ

పొత్తుల్లేవ్.. ఒంటరిగా పోటీకి రెడీ

అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయాన్ని స్వాగతించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.  దారులు వేరైనప్పుడు ఆ నిర్ణయం మంచిదేనని  ప్రతి ఒక్కరికి అభినందనలు అని అన్నారు. ఉప ఎన్నికల్లో తాము  కూడా  ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎస్సీ,బీఎస్పీ కూటమికి ఫలితాలు నిరాశజనకంగా రావడంతో  అఖిలేష్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు మాయావతి. ఎస్పీ వల్లే తాము ఓడిపోయామన్నారు. ఉప ఎన్నికల్లో పొత్తులేకుండా బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. అవసరమైతే భవిష్యత్తులో ఎస్పీతో జతకడుతామన్నారు మాయావతి.