రేపటి భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి: రోహిత్, కోహ్లీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

రేపటి భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి: రోహిత్, కోహ్లీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

IND vs WI Rain Threat: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రేపు (ఆదివారం, సెప్టెంబర్ 27) జరగనున్న భారత్ వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే మ్యాచ్‌పై వరుణుడి నీడ కమ్ముకుంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని టీమిండియా ఈ సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. స్థానిక వాతావరణం మాత్రం క్రికెట్ అభిమానులను తెగ కలవరపెడుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రీఎంట్రీతో మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, వర్షం గండం ఏ విధంగా ఉంటుందనేది కాస్త ఆందోళన కలిగిస్తోంది.

తిరువనంతపురంలో వర్షం గండం: 

* ఆక్యువెదర్ (AccuWeather) నివేదిక ప్రకారం రేపు మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసేందుకు 25 శాతం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే నగరంలో కురిసిన వర్షాలతో ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లకు కొంత అంతరాయం కలిగింది. కానీ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే (Washout) అవకాశం లేనప్పటికీ, మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి లేదా ఆట మధ్యలో చిన్నపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. వరుణుడు కరుణించి ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రోహిత్, కోహ్లీ రీఎంట్రీ: 

ఈ మ్యాచ్ ద్వారా భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి వన్డేల్లోకి అడుగు పెడుతున్నారు. వీరిద్దరి రాకతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎంతో శక్తివంతంగా మారిపోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతుండగా.. మరోవైపు షాయ్ హోప్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్లాన్స్ రచిస్తోంది. 2025 నుంచి వన్డేల్లో తడబడుతున్న విండీస్.. ఈ సిరీస్‌తో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది.

►ALSO READ | ఆసియా గేమ్స్‌లో భారత్ జోరు.. ఇరాన్‌పై 39–34 తేడాతో విజయం: కబడ్డీలో గోల్డ్ మెడల్!

మ్యాచ్ ఎక్కడ చూడాలంటే?

* మ్యాచ్: భారత్ vs వెస్టిండీస్, తొలి వన్డే

* తేదీ, సమయం: సెప్టెంబర్ 27, 2026, మధ్యాహ్నం 2:00 గంటలకు (టాస్: 1:30 PM)

* వేదిక: గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం

* టీవీ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network)

* లైవ్ స్ట్రీమింగ్: జియోహాట్‌స్టార్ (JioHotstar) యాప్ మరియు వెబ్‌సైట్