ఎప్సెట్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల ప్రతిభ

ఎప్సెట్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల ప్రతిభ

కరీంనగర్, వెలుగు: ఎప్​సెట్​–2026 ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి కరీంనగర్ చరిత్రలో కనీవినీ ఎరుగని ర్యాంకులు సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఎప్​సెట్​ఫలితాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో డి.రిత్విక్ 11వ ర్యాంకు సాధించగా, ఇంజినీరింగ్ విభాగంలో పి.చరణ్ 22వ ర్యాంకుతో ద్వితీయ స్థానంలో నిలిచాడని తెలిపారు.

32 మంది విద్యార్థులు 1,000లోపు ర్యాంకు సాధించారని, 57 మంది విద్యార్థులు 2,000లోపు ర్యాంకులు, 88 మంది విద్యార్థులు 3,000లోపు, 127 మంది విద్యార్థులు 4000లోపు ,169 మంది విద్యార్థులు 5,000లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక ర్యాంకులు సాధించడం ‘అల్ఫోర్స్’కు మాత్రమే సాధ్యమైందన్నారు. అనంతరం ఎప్​సెట్​ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన ‘అల్ఫోర్స్’ విద్యార్థులు వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపకలు, అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.