
- డియోస్కోవ్యాక్స్ 2ను తయారు చేసిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ
- కంప్యూటర్ త్రీడీ మోడలింగ్ ద్వారావ్యాక్సిన్ తయారీ
- సింథటిక్ డీఎన్ఏలతో అన్నికరోనావైరస్లతో యాంటీజెన్ల సృష్టి
- సూది లేకుండా ‘స్ప్రింగ్ జెట్ ఇంజెక్షన్’తో నేరుగా చర్మంలోకి టీకా
లండన్: అప్పట్లో మెర్స్, సార్స్.. ఇప్పుడు నావెల్ కరోనా వైరస్! పేరు మారిందే తప్ప వాటి ఫ్యామిలీ ఒక్కటే.. ఆ ఫ్యామిలీనే కరోనా. ఇవే కాదు.. ఆ ఫ్యా మిలీలో 7 కరోనా వైరస్లున్నాయని సైంటిస్టులు అంటున్నారు. అందులో మెర్స్, సార్స్‌కు వేర్వేరు వ్యాక్సిన్‌లున్నాయి . ఇప్పుడు కొత్త కరోనా వైరస్కూ కొత్త వ్యాక్సిన్లను తయారు చేస్తున్నా రు. కానీ, ఇలా ఒక్కో కరోనా వైరస్ కు ఒక్కో వ్యాక్సిన్ కాకుండా.. మొత్తం కరోనా ఫ్యామిలీకి ఒకే వ్యాక్సిన్ ను తయారు చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేసింది బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ. ఆలో చనను ఆచరణలోపెట్టింది. వ్యాక్సిన్‌ను తయారు చేసింది. తొందరలోనే ట్రయల్స్‌కు సిద్ధమవు తోంది. ఏంటా వ్యాక్సిన్ ? ఎట్లా పనిచేస్తుంది? దానిని ఎలా తయారు చేశారు?
సూది అక్కర్లేదు..
వైరస్ డీఎన్ఏ ఆధారంగా కేంబ్రిడ్జి యూనివర్సి టీ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ పేరు డియోస్ కోవ్యాక్స్ 2. వర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన డియోసిన్ వ్యాక్సిన్ అనే కంపెనీ ద్వారా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అయితే, ఇప్పు డున్న అన్ని వ్యాక్సిన్లకు ఇది భిన్నమని చెబుతున్నారు వర్సిటీలోని వైరల్ జూనోటిక్ లేబొరేటరీ హెడ్ ప్రొఫెసర్ జొనాథన్ హీనీ. దీనిని వేసేందుకు సూది అవసరం లేదన్నా రు. ‘స్ప్రింగ్ ’తో వ్యాక్సిన్‌ను నేరుగా చర్మం లోకి నొప్పి లేకుండా ఎక్కించొచ్చన్నా రు. ఈ జెట్ ఇంజెక్షన్ ద్వారా సెకనులో పదోవంతు స్పీడ్‌తోనే మందు ఒంట్లో కలిసిపోతుందని చెప్పారు. ఫ్రీజ్డ్రయింగ్ టెక్నిక్ ద్వారా పౌడర్ రూపంలో వ్యాక్సిన్ తయారు చేశామని డియోసిన్ వ్యాక్సిన్ కంపనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రెబెక్కా కిన్స్లీ చెప్పారు. దాని వల్లఎలాంటి టెంపరేచర్‌లోనైనా వ్యాక్సిన్ పాడు కాదన్నారు. ఈ వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం డబ్బు సాయం కూడా చేస్తోంది. ఇప్పటికే 19 ల క్ష ల పౌండ్లను ఇచ్చింది. ప్రస్తుతం ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఈ వ్యాక్సిన్. . ఈ ఏడాది చివరి నాటికి క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అతి తక్కువ ఖర్చుతోనే వ్యాక్సిన్‌ను తయారు చేయొచ్చంటున్నారు.