తమిళనాడు ఎన్నికలు: డీఎంకే తొలి జాబితా విడుదల.. కొలత్తూరు నుంచే స్టాలిన్

తమిళనాడు ఎన్నికలు: డీఎంకే తొలి జాబితా విడుదల.. కొలత్తూరు నుంచే స్టాలిన్

తమిళనాడులో అసెంబ్లీ  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలివిడత జాబితాను విడుదల చేసింది డీఎంకే. మిత్రపక్షాలతో చర్చల అనంతరం 234 సీట్లలో 164 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు డీఎంకే చీఫ్​ ఎంకే స్టాలిన్. డీఎంకే ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు కేటాయించిన 28 స్థానాలను కేటాయించారు. పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవంకోడ్, శివకాశి , కారైకుడి వంటి ప్రధాన అసెంబ్లీ సెగ్మెంట్లు ఇందులో ఉన్నాయి. 

ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు ఇప్పటికే 10 స్థానాలను కేటాయించగా, వాటిలో విరుదాచలం, పల్లవరం కీలక స్థానాలను కేటాయించారు. మరో మిత్రపక్షం విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీకి 8సీట్లు కేటాయించారు. సీపీఎం, సీపీఐ పార్టీలకు  చెరో ఐదు సీట్లను కేటాయించారు. 

►ALSO READ | LPG ఇంకా ఇంటికి చేరలేదా..? రేషన్లో కిరోసిన్ ఇస్తున్నారు.. ఒక్కో ఫ్యామిలీకి మూడు లీటర్లు..!

డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ శనివారం (మార్చి28) చెన్నైలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. బోడినాయకనూర్ నుంచి పన్నీర్‌సెల్వంను పార్టీ బరిలోకి దించగా, కొలత్తూరు నుంచి సీఎం స్టాలిన్‌, చేపాక్-ట్రిప్లికేన్ నుంచి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మళ్లీ పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కోయంబత్తూరు సౌత్ (దక్షిణ) నుంచి బరిలోకి దిగనున్నారు.