విభజన హామీల అమలేది..  సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రాములు

విభజన హామీల అమలేది..  సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రాములు

హుజూర్ నగర్, వెలుగు:  విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేయకుండా ప్రధాని మోడీ ఎన్ని సభలు పెట్టి, ఎన్ని హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రాములు విమర్శించారు.  శనివారం వరంగల్‌లో నరేంద్ర మోడీ పర్యటనను నిరసిస్తూ ఇందిరా సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో నల్ల కండువాలు, బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానికి విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు.

రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు.  పోలీసులు ప్రధాని పర్యటనను సాకుగా చూపి సీపీఐ నాయకులను నిర్బంధంలోకి తీసుకోవాడాన్ని వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్, నేతలు దేవరం మల్లేశ్వరి, గుండు వెంకటేశ్వర్లు, జడ శ్రీనివాస్, యల్లావుల రమేశ్, దొంత గాని సత్యనారాయణ, బాదే నరసయ్య, పశ్య వెంకట్ రెడ్డి,  వెంకటేశ్వర్లు,  వెంకన్న, చెన్నగాని సైదులు, కుడి తొట్టి స్వామి, రుద్రయ్య, జక్కుల రమణ పాల్గొన్నారు.