స్పేస్‌లో నడిచి.. రిపేర్‌ చేసి

స్పేస్‌లో నడిచి.. రిపేర్‌ చేసి

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు అటాచ్‌ చేసిన కాస్మిక్‌ రే డిటెక్టర్‌ (ఆల్ఫా మాగ్నెటిక్‌ స్పెక్ట్రోమీటర్‌ డార్క్‌ మ్యాటర్‌, యాంటీమ్యాటర్‌ డిటెక్టర్‌) పని కాలాన్ని పెంచేందుకు కొంతకాలంగా ఆస్ట్రొనాట్లు రిపేర్లు చేస్తూనే ఉన్నారు. ఈ శనివారం కూడా ఓ రిపేర్‌ను విజయవంతంగా చేశారు. ఇందుకోసం ఐఎస్‌ఎస్‌ బయటికి వెళ్లి స్పేస్‌ వాక్‌ చేయాల్సి వచ్చింది. సుమారు 6 గంటలు కష్టపడి పని పూర్తి చేశారు. పొద్దున 7 గంటలకు పని మొదలుపెడితే మధ్యాహ్నం 1.30 గంటలకు పూర్తయింది. ఏఎంఎస్‌కు సెట్‌ చేసిన కొత్త కూలింగ్‌ సిస్టమ్‌ లీక్‌ను విజయవంతంగా సరిదిద్దారు.  ఏడు టన్నులున్న ఈ ఏఎంఎస్‌ను తొమ్మిదేళ్ల కిందట ఐఎస్‌ఎస్‌కు బిగించారు. అప్పుడు మూడేళ్ల కాలానికే దీన్ని తయారు చేశారు.  2014లో దాని కూలింగ్‌ సిస్టమ్‌ పాడవడంతో మొరాయించింది. అప్పటికే అది తన ద్వారా పోయిన 14,000 కోట్ల పార్టికల్స్‌ ను గుర్తించింది. దీంతో దాని అవసరం 11 ఏళ్ల ఫుల్‌ సోలార్‌ సైకిల్‌ వరకు అవసరమని, అలాగైతే సోలార్‌ రేడియేషన్‌ను బాగా అర్థం చేసుకోవచ్చని భావించిన సైంటిస్టులు జీవితకాలం పెంచుతూ వస్తున్నారు.