బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ధురంధర్ 2' (Dhurandhar 2). థియేటర్లలోకి వచ్చిన తొలి రోజు నుంచి మంచి స్పందనను అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది సంచలనం సృష్టించిన 'ధురంధర్ 'కి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ, కేవలం ఇండియన్ బాక్సాఫీస్‌నే కాకుండా గ్లోబల్ మార్కెట్‌ను కూడా షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌ను దాటేసింది. అయితే, ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు పక్క దేశమైన పాకిస్థాన్‌లో కూడా సెన్సేషన్ సృష్టిస్తోంది.
కరాచీ రోడ్లు.. రణ్‌వీర్ రూట్లు!
ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. కరాచీకి చెందిన ఒక నెటిజన్ చేసిన రీల్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. సినిమాలో రణ్‌వీర్ సింగ్ పాత్ర కరాచీలోని రోడ్లు, గల్లీలు, భౌగోళిక పరిస్థితులపై చూపిస్తున్న పట్టు చూసి ఆ నెటిజన్ ఆశ్చర్యపోయాడు. "రణ్‌వీర్ సింగ్‌కు కరాచీ రూట్లపై ఉన్న అవగాహన చూస్తుంటే, ఆయన గనుక నిజంగా ఇక్కడికి వస్తే అస్సలు గూగుల్ మ్యాప్ కూడా అవసరం లేదు అంటూ చమత్కరించాడు. సినిమా రూపకర్తలు కేవలం పైపైన కథ చెప్పకుండా, క్షేత్రస్థాయిలో రీసెర్చ్ చేసి మరీ లొకేషన్ల వివరాలను అద్భుతంగా చూపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ల్యారీ వాసుల వింత కోరిక..
సినిమాలో ఎక్కువగా కరాచీలోని ల్యారీ (Lyari) ప్రాంత నివాసుల జీవితాన్ని, వారి సమస్యలను ఆదిత్య ధర్ వెండితెరపై ఆవిష్కరించారు. తమ ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూనే, చాలా సరదాగా ఒక కోరికను దర్శకుడి ముందు ఉంచారు. ఈ సినిమా ఇప్పటికే రూ. 1100 కోట్లు వసూలు చేసింది కదా! అందులో మా వాటాగా ఒక రూ. 500 కోట్లు మాకు ఇచ్చేయండి. ఆ డబ్బుతో మా ల్యారీ ప్రాంతంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేసుకుంటాం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం అంటూ వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Pakistani delulu aawam is saying that Aditya Dhar will earn 1000 Crore from #Dhurandhar2TheRevenge , he should return back 500 crore to Lyari because we don't have good roads here 😭😭😭😂😂😂😂 pic.twitter.com/kBdtGYvPla
— Chota Don (@choga_don) March 27, 2026
బోర్డర్ దాటిన ఫ్యాన్స్..
వాస్తవానికి ల్యారీ ప్రాంతం పాకిస్థాన్‌లో అత్యంత పేదరికంతో కూడిన ప్రాంతం. అటువంటి చోట నివసించే వారి కష్టాలను, జీవనశైలిని చాలా నిజాయితీగా సినిమాలో చూపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆర్ట్ వర్క్ నుండి స్క్రీన్ ప్లే వరకు ప్రతిదీ రియలిస్టిక్‌గా ఉండటమే 'ధురంధర్ 2' ఇంతటి భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి రణ్‌వీర్ సింగ్ తన నటనతో బోర్డర్ అవతల ఉన్న వారిని కూడా తన ఫ్యాన్స్‌గా మార్చుకున్నాడు.
