తమిళ స్టార్ హీరో సూర్య, ప్రసెంట్ సెన్సేషనల్ బ్యూటీ మమిత బైజు జంటగా నటించిన మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons). లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
‘ప్రేమలు’ ఫేమ్ యంగ్ బ్యూటీ మమితా బైజు- టాప్ హీరో సూర్యల స్క్రీన్ ప్రెజెన్స్ ఆసక్తిగా ఉంది. సూర్య గతంలో ఎన్నడూ చేయని విధంగా చాలా కూల్ అండ్ క్లాసీ రోల్‌లో కనిపిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సూర్య ‘సంజయ్ విశ్వనాథ్’ అనే ప్రొఫెషనల్ షూటర్ పాత్రలో కనిపిస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. దానికితోడు తన కంటే వయసులో చాలా చిన్నదైన మమితా బైజు.. సూర్య జీవితంలోకి ప్రవేశించి, ఆయన్ని అమితంగా ప్రేమిస్తుండటం క్యూరియాసిటీ పెంచుతుంది. వీరి మధ్య ఉన్న ‘ఏజ్ గ్యాప్’ వల్ల వచ్చే సున్నితమైన భావోద్వేగాలను దర్శకుడు వెంకీ అట్లూరి చాలా అందంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ALSO READ : నాగ్ కేడీ డైరెక్టర్ ‘KK’ చివరి సినిమా.. ‘KJQ: కింగ్.. జాకీ.. క్వీన్’ మెప్పించిందా?
ఆలోచింపజేస్తున్న డైలాగ్స్..: ‘‘మన డబ్బు, స్టేటస్, అన్నీ మనకు సౌకర్యాన్ని ఇవ్వాలి.. అహంకారం కాకూడదు’’, ‘‘మనుషులు విడిపోయేది గొడవల కాదండీ.. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక’’, ‘‘గెలిచేదాకా ఆగకూడదు.. గెలిచినా తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువ మాట్లాడకూడదు’’ అని సూర్య చెప్పే డైలాగ్స్ ఇంటెన్స్గా ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ట్రైలర్కు ప్రాణం పోసింది. ఆయన అందించిన నేపథ్య సంగీతం మనసును హత్తుకునేలా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాయి.
