అమరావతికి చట్టబద్దత తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం...

అమరావతికి చట్టబద్దత తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం...

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. శనివారం ( మార్చి 28 ) జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు. ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. అసెంబ్లీలో ఆమోదం పొందిన అమరావతికి చట్టబద్దత తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది ఏపీ సర్కార్. దీంతో ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని దిశగా కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి.

విభజన చట్టం సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2లో ఎట్ అమరావతి పదాన్ని చేర్చాలని తీర్మానంలో ప్రతిపాదించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. స్పష్టమైన అభివృద్ధి కోసం అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని పేర్కొన్నారు. 

ALSO READ : రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా... ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నాం

ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5ని సవరించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అమరావతిలో నిర్మాణాలు 2028 కల్లా పూర్తి చేస్తామని అన్నారు. ప్రధాని మోడీ సమక్షంలో రాజధాని భవనాలను ప్రారంభిస్తామని వెల్లడించారు చంద్రబాబు.

అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది.