ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశాపెట్టింది కూటమి సర్కార్. శనివారం ( మార్చి 28 ) జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో తీర్మానంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నామని అన్నారు.రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని అన్నారు.
తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అనే భావన తనకు ఎప్పుడూ లేదని అన్నారు పవన్ కళ్యాణ్. 6 దశాబ్దాలు గడుస్తున్నా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉండటం బాధాకరమని అన్నారు. అమరావతి కోసం రైతులు ఇష్టంతో భూములు ఇచ్చారని అన్నారు.
►ALSO READ | అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానం
వైసీపీ హయాంలో అమరావతి విషయంలో చాలా గొడవలు జరిగాయని... ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటికి రాని మహిళలు కూడా రోడ్ల మీదకు వచ్చారని అన్నారు. అమాయక రైతుల మీద దాడులు జరిగాయని అన్నారు.
అమరావతి రైతులకు మద్దతుగా వెళ్లిన తనను రానివ్వకుండా ముళ్ల కంచెలు వేశారని అన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ కి ఒకే ఒక్క రాజధాని అది అమరావతి అవుతుందని జనసేన తరపున తీర్మానం తీసుకున్నామని అన్నారు.
