విరాట్ కోహ్లీ వల్ల గర్భవతిని అయ్యా: బేబీ బంప్‌తో వీడియో షేర్ చేసిన యువతి

విరాట్ కోహ్లీ వల్ల గర్భవతిని అయ్యా: బేబీ బంప్‌తో వీడియో షేర్ చేసిన యువతి

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానున్న వేళ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. విరాట్ కోహ్లీ వల్ల తాను గర్భవతిని అయ్యాయని ఆరోపించింది. ఈ మేరకు బేబీ బంప్‎తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో తర్వాత తాను ఘోరంగా ట్రోలింగ్ అవుతానని ముందుగానే చెప్పింది సదరు యువతి. 

వీడియోలో ఉన్న యువతి గతంలో హైదరాబాద్ పాతబస్తీలో ఉంటూ దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. కోహ్లీపై యువతి చేసిన ఆరోపణలపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోహ్లీ అభిమానులు.  

ఐపీఎల్ 19వ ఎడిషన్కు సమయం ఆసన్నమైంది. శనివారం (మార్చి 28) చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే తొలి పోరుతో ఈ సమ్మర్ క్రికెట్ కార్నివాల్ ప్రారంభం కానుంది. 

గతేడాది తొలి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతుండగా.. మరోవైపు యంగ్‎స్టర్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ సత్తా చాటాలని చూస్తోంది. తొలి పోరులో గెలిచి ట్రోఫీ వేటను షురూ చేయాలని ఇరు జట్లూ భావిస్తుండగా.. కొత్త సీజన్లో తమదైన మార్కు చూపెట్టాలని మిగిలిన 8 టీమ్స్ ఆశిస్తున్నాయి.